‘సలార్’ నుండి లేటెస్ట్‌ అప్ డేట్..

375
- Advertisement -

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్‌ అప్ డేట్ వచ్చింది. చిత్ర బృందం ఈ మూవీ విడుదలపై ఆసక్తికర సమాచారం తెలిపింది ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మే నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నామని చిత్ర నిర్మాత చెప్పుకొచ్చారు.

- Advertisement -