మళ్లీ నిరాశపర్చిన ప్రభాస్ ‘సలార్’!

50
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా, శృతి హాస‌న్ హీరోయిన్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా స‌లార్. టీజ‌ర్‌తో అంచ‌నాలు పెంచుకున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ సెప్టెంబ‌ర్ 28గా అనౌన్స్ చేశారు. అయితే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్ప‌టికీ.. స‌లార్ టీమ్ ఇంకా సైలెంట్‌గానే ఉండ‌టంతో ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుందేమోన‌ని ప్రభాస్ ఫ్యాన్స్‌ కంగారు పడ్డట్టుగానే జరిగింది.

యూఎస్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేయగా ఏ ఇండియన్ సినిమాకు రాని రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో “సలార్” చిత్రం వాయిదా కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:యుఎస్‌లో ‘ఖుషి’గా వసూళ్లు!

- Advertisement -