- Advertisement -
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సలార్. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరవార్త టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకురానుందట. రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్స్‌లో సలార్ రెండు భాగాలుగా వస్తుందా అని ప్రభాస్‌ను ఓ విలేఖరి అడగుగా.. దానికి ఆయన, దీనిపై త్వరలో మేకర్స్ క్లారిటీ ఇస్తారని సమాధానం చెప్పారు. దాంతో ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుందని ప్రచారం మొదలైంది.
వాస్తవానికి ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు సలార్ రావాల్సి ఉండగా వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ అయింది. రాధేశ్యామ్ తర్వాత సలార్ రిలీజ్ కానుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Advertisement -