Salaar:100 డేస్‌ టూ గో

19
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్‌తో మిక్స్‌డ్‌ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే నెల రోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌ సహా రెండు పాటలు సినిమాపై తిరుగులేని అంచనాలు నెలకొల్పాయి. దాంతో ప్రభాస్‌ అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. బాహుబలి తర్వాత ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా హ్యాట్రిక్‌ ఫ్లాప్స్‌ రావడంతో వాళ్ల బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం వాళ్ల ఆశలన్నీ సలార్‌ సినిమాపైనే ఉన్నాయి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ ఒకటి వచ్చింది. మరో వంద రోజుల్లో సలార్‌ విడుదల కానున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.

Also Read: ఎన్టీఆర్, తేజ్, లావణ్య అభినందనలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది హండ్రెడ్‌ డేస్‌ ఆఫ్ సలార్‌ అనే హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్‌ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను జూలై మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాను హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

Also Read: జూన్‌30.. లవ్‌ యూ రామ్‌ విడుదల

- Advertisement -