రిలీజ్‌కి ముందే సరికొత్త రికార్డులు

49
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’ రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులు కొల్లగొడుతుంది. అమెరికాలో 1979 పైగా ప్రాంతాల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. యూఎస్‌ లో అత్యధిక లొకేషన్లలో రిలీజ్ కానున్న తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా మారనుంది. మొత్తం 1,979 లొకేషన్లు అంటే.. ఒకరకంగా ఇది మరో సినిమాకి సాధ్యం కాకపోవచ్చు. ఇప్పటివరకు ఈ రికార్డ్ ఆర్ఆర్ఆర్ సినిమా పేరట ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికాలో 1,165 పైగా ప్రాంతాల్లో విడుదల అయింది. కానీ, సలార్ సినిమా, ఆర్ఆర్ఆర్ సినిమా కంటే దాదాపు 800 వందల అధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

అన్నట్టు, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాధేశ్యామ్ 776 థియేటర్స్ లో, అజ్ఞాతవాసి 515 థియేటర్స్ లో, సర్కారు వారి పాట 486 థియేటర్స్ లో, బాహుబలి-2 423 థియేటర్లలో అమెరికాలో రిలీజ్ అయ్యాయి. మొత్తమ్మీద ప్రభాస్ సలార్ సినిమా అన్నీ సినిమాల రికార్డులను బ్రేక్ చేయబోతుంది. సహజంగా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయితే, కలెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి, భారీ ఓపెనింగ్స్ సాధించిన నెంబర్ వన్ సినిమాగా కూడా సలార్ సినిమానే నిలవనుంది. సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

Also Read:ఆ హీరోయిన్ విడాకులు.. నిజమే

పైగా రీసెంట్ గా రిలీజ్ అయిన ‘సలార్’ టీజర్ యూట్యూబ్‌లో దూసుకెళ్లింది. టీజర్‌లో ప్రభాస్ మాస్ లుక్, బీజీఎం, ఎలివేషన్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. దీనికితోడు టీజర్‌లో పార్ట్1- CEASEFIRE అని పేర్కొనడంతో ఈ మూవీ పార్ట్-2 కూడా ఉంటుందని క్లారిటీ వచ్చింది. ఏది అయితే ఏం ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు సలార్‌ పైనే ఉన్నాయి. మరి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో చూడాలి.

Also Read:ఢిల్లీని వణికిస్తున్న డెంగీ..

- Advertisement -