ఇండో, చైనా సరిహద్దు ఘర్షణలో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబుకు కన్నీటి విడ్కోలు పలికారు. ఇక సెలవు అంటూ కుటుంబసభ్యులు,ఆర్మీ అధికారుల సమక్షంలో కేసారంలోని సంతోష్ వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు జరిగాయి. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగగా బంధువులతో పాటు రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించారు.
కడసారి సంతోష్ పార్థివదేహాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. 6 కిలోమీటర్లు ఎంజీ రోడ్డు,శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్,పాత బస్టాండ్ ,కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా అంతిమయాత్ర సాగింది. దారి పొడవునా వేలాది మంది ప్రజలు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
దాదాపు రెండు గంటల పాటు అంతిమయాత్ర కరోనా నిబంధనలకు అనుగుణంగా అంతిమయాత్ర సాగగా దారిపొడవునా సంతోష్ భౌతికకాయంపై పూలు చల్లుతూ వీరుడా నీకు జోహర్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.