ప్రారంభ‌మైన అవ‌తార్2 షూటింగ్..

198
Avatar2shooting
- Advertisement -

హాలీవుడ్ మూవీ అవ‌తార్ భారీ స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈచిత్రానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అద్భుతమైన స్పంద‌న వ‌చ్చింది. ఇక ఈమూవీకి సీక్వేల్ ను తెర‌కెక్కిస్తున్నారు. కాగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఈమూవీ షూటింగ్ గ‌త కొద్ది రోజులుగా వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే స‌గం వ‌ర‌కు చిత్రిక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈచిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.

లాక్ డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో త‌క్కువ మందితో చిత్ర‌క‌ర‌ణ‌ను ప్రారంభించారు. ఈమూవీ చిత్రిక‌ర‌ణ‌కు ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ 50మందితో క‌లిసి ప్ర‌త్యేక విమానంలో న్యూజిలాండ్ కు చేరుకున్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం 14రోజులు హోం క్వారంటైన్ లో ఉన్నారు. నిన్న‌టితో క్వారంటైన్ ముగిసిపోవ‌డంతో తిరిగి షూటింగ్ ను ప్రారంభించారు చిత్ర‌యూనిట్. కాగా న్యూజిలాండ్ లో క‌రోనా పూర్తిగా కంట్రోల్ కావ‌డంతో షూటింగ్ ల‌కు అనుమ‌తి ఇచ్చారు.

షూటింగ్ ప్రారంభ‌మైన విష‌యాన్ని తెలియ‌జేస్తూ సోష‌ల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేశారు నిర్మాత జోన్‌ ల్యాండ్. అవ‌తార్ సినిమాకు సంబంధించి 2,3,4,5 సిక్వేల్ లు రెడీ అవుతున్నాయ‌ని అవ‌తార్ 2 సినిమాను డిసెంబ‌ర్ 17 న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించార‌. కానీ క‌రోనా వైర‌స్ వ్యాపించ‌డంతో ఈమూవీ విడుద‌ల ఆల‌స్యం కానున్న‌ట్లు తెలుస్తుంది.

- Advertisement -