పోస్ట్ ప్రొడక్షన్‌లో “సకల కళా వల్లభుడు”..

269
Sakala Kala Vallabhudu
- Advertisement -

“ఆ అయిదుగురు” చిత్రంతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు తనిష్క్ రెడ్డి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “సకల కళా వల్లభుడు”. సింహా ఫిలిమ్స్ పతాకంపై అనిల్ గుంట్రెడ్డి-త్రినాధ్ డడాల-కిషోర్-శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కి జి.శివ దర్శకత్వం వహిస్తుండగా.. తనిష్క్ రెడ్డి సరసన మేఘ్ల కథానాయికగా నటిస్తోంది.
Sakala Kala Vallabhuduటాకీపార్ట్ తోపాటు పాటల చిత్రీకరణ కూడా పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసి.. సెప్టెంబర్ నెలాఖరుకల్లా చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మాస్ మసాలా ఎలిమెంట్స్ తోపాటు యూత్ ను ఎట్రాక్ట్ చేసే అన్నీ అంశాలతో ఒక పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “సకలకళా వల్లభుడు” ఆడియన్స్‌ను విశేషంగా అలరిస్తుందన్న నమ్మకం తమకు ఉందని దర్శకుడు జి.శివ తెలిపారు.

Sakala Kala Vallabhudu

హీరోగా తనకు మంచి స్టార్ డమ్ తీసుకొచ్చే సినిమాగా “సకలకళా వల్లభుడు” నిలుస్తుందని కథానాయకుడు తనిష్క్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశాడు. “గుంటూరు టాకీస్, పి.ఎస్.వి గరుడ వేగ” ఫేమ్ ధర్మేంధ్ర కాకరాల ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ సోదరుడు అజయ్ పట్నాయక్ సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -