హైదరాబాద్‌ కమిషనర్‌గా సజ్జనార్

8
- Advertisement -

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. హైదరాబాద్ నూతన కమిషనర్‌గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు.

తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విజయకుమార్‌.. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా రఘునందన్‌రావు, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డీజీగా రవిగుప్తా నియమితులయ్యారు.

SPF డీజీగా స్వాతీ లక్రాను నియమించగా ఏడీజీ పర్సనల్‌గా మహేశ్ భగవత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్‌ క్రైమ్స్‌ అడిషనల్‌ సీపీగా ఎం.శ్రీనివాసులు,హైదరాబాద్‌ లా అండ్‌ ఆర్డర్‌ జాయింట్‌ కమిషనర్‌గా తఫసీర్‌ ఇక్బాల్‌ నియమితులయ్యారు.

Also Read:Asia Cup: సూపర్ ఓవర్‌లో భారత్ గెలుపు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్

హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్

ఇంటెలిజెనర్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్

ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా రఘునందన్‌రావు

సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖ బాధ్యతలు

గ్రేహౌండ్స్ ఏడీజీగా అనిల్‌ కుమార్

పౌరసరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర

ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్‌సింగ్

.హైదరాబాద్ క్రైమ్స్ ఏసీపీగా శ్రీనివాసులు

హైదరాబాద్ అడిషనల్ శాంతిభద్రతల సీపీగా తసఫీర్ ఇక్బాల్

వెస్ట్‌జోన్ డీసీపీగా అనురాధ, సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్

నారాయణపేట ఎస్పీగా వినీత్,

రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత

స్పెషల్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఝా

G.O.1340 – IAS – Transfers & Postings

- Advertisement -