సీత పాత్ర ఏ హీరోయిన్ చేస్తోందో?

26
- Advertisement -

దర్శకుడు నితీష్ తివారి బాలీవుడ్ లో భారీ ఎత్తున ‘రామాయణం’ తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటించనున్నాడు. కాకపోతే, సీతమ్మ పాత్ర పైనే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నారు. మొదట్లో నయనతార బాగుంటుంది అని భావిస్తున్నారు. ఐతే, నయనతార ఇంకా ఈ సినిమాకి సైన్ చెయ్యలేదు. ఆ తర్వాత సాయి పల్లవి పేరు కూడా బాగా వినిపించింది. కానీ సాయి పల్లవి త్వరగా సినిమాలు ఒప్పుకోదు.

స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాతే సాయి పల్లవి సినిమాకి సైన్ చేస్తోంది. మరి దర్శకుడు నితీష్ తివారి రాసుకున్న స్క్రిప్ట్ సాయి పల్లవికి నచ్చుతుందా ?, ఒకవేళ సాయి పల్లవి కాకపోతే మరి ఎవరు ?, కియారా అద్వానీ ఐతే బాగుంటుంది అని నిర్మాత ఆలోచన. కానీ దర్శకుడు మాత్రం నయనతార వైపు మొగ్గు చూపుతున్నాడు. ఒకవేళ, నయనతార కుదరకపోతే.. సాయి పల్లవిని సీత పాత్రలో చూపించాలని పట్టుదలగా ఉన్నాడు, నయనతార గతంలో బాలయ్య సరసన సీతగా నటించి మెప్పించింది.

పైగా నయనతారకి సీత పాత్ర బాగా సూట్ అవుతుంది కూడా. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే.. ఆమె సహజ నటి. కాబట్టి, సీతగా సాయి పల్లవి కూడా బెస్ట్ ఆప్షన్. అందుకే, దర్శకుడు నితీష్ తివారి సౌత్ హీరోయిన్ల పై ఆసక్తి చూపిస్తున్నాడు. అన్నట్టు ఈ రామాయణం షూటింగ్ ఈ ఏడాదే మొదలవుతుంది. రణబీర్ కపూర్ రాముడిగా నటించాలని ఉత్సహంగా ఉన్నారట. మరి చివరికి ఎవరు సీతగా సెట్స్ లోకి అడుగుపెడుతారో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం, కియారా అద్వానీ పర్సనాలిటీకి సీత పాత్ర సూట్ అవదు. సాయి పల్లవే బెస్ట్ ఛాయిస్.

Also Read:లోక్ సభ ఎన్నికలపై.. సంచలన సర్వే !

- Advertisement -