చరిత్ర సృష్టించిన సైనా, సింధు..

248
PV Sindhu
- Advertisement -

ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ పతకం ఎట్టకేలకు ఖాయమైంది. భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పి.వి.సింధు చారిత్రక పతకాలు ఖాయం చేశారు. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో వీళ్లిద్దరు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో సైనా 21-18, 21-16తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ రచనోక్‌ ఇంటానోన్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది. సైనాతో పోలిస్తే సింధు కష్టపడింది. హోరాహోరీ సాగిన పోరులో ఆమె 21-11, 16-21, 21-14తో జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది.

PV Sindhu

సెమీస్‌లో సైనా.. ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో, అకానె యమగూచి (జపాన్‌)తో సింధు తలపడనున్నారు. సెమీస్‌కు దూసుకెళ్లడం ద్వారా సైనా, సింధు భారత్‌కు కనీసం కాంస్య పతకాలను ఖాయం చేశారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ చరిత్రలో భారత్‌కు ఒకే ఒక్క సింగిల్స్‌ పతకం ఉంది. 1982 దిల్లీ క్రీడల్లో సయ్యద్‌ మోదీ కాంస్యం గెలిచాడు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 8 పతకాలు గెలువగా, టీమ్ ఈవెంట్లలో ఆరు, పురుషుల డబుల్స్‌లో ఒకటి ఉన్నాయి.

- Advertisement -