సారా కూడా రెచ్చిపోతోంది…

514
Saif Ali Khan's Daughter Sara Ali Khan To Sport A Bikini
- Advertisement -

హీరోయిన్‌ గా వస్తున్నామంటే…ఎంట్రీ అదిరిపోవాల్సిందే. ఎంట్రీ మాత్రమేనా? …స్టార్‌ హీరోయిన్‌ గా ఎదిగి రచ్చ రచ్చ చెయ్యాల్సిందే. సిని ఇండస్ట్రీ మొత్తం మన గురించే గుసగుసలాడాలి. అందుకోసం ఎలాంటి ఎంట్రీకైనా రెడీనే.

అచ్చు ఇలానే ఆలోచిస్తున్నారు ఇప్పటి నవతరం హీరోయిన్లు. అసలు ఇదే వారి ఈ హీరోయిన్ల ఆలొచన. ఎందుకంటే.. ఎంట్రీ ఇచ్చామా.. హంగామా చేశామా..తట్టాబుట్టా సర్థుకొని వెళ్ళిపోయామ. ఇలాంటి రొటీన్‌ ఆలోచనలతో కాకుండా కొత్తగా ఆలోచించడం స్టార్ట్‌ చేసేశారు ఇప్పటి హీరోయిన్లు.

ఇలాంటి భామల లిస్ట్‌ లో సారా కూడా చేరుతోంది. అందుకే సరుకు ఉన్నప్పుడే సంచలనాలకు తెర తీయాలని డిసైడ్‌ అయిపోయింది సారా అలీఖాన్‌. ప‌టౌడీల వార‌సురాలిగా సైఫ్ అలీఖాన్ కుమార్తె సిని ఇండస్ట్రీకి ఎంటర్‌ అవుతుండడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.

 Saif Ali Khan's Daughter Sara Ali Khan To Sport A Bikini

సారా తన ఫస్ట్‌ మూవీలో నే బికినీతో హీట్‌ పుట్టించేందుకు రెడీ అవుతోందని సమాచారం. మొదటి చిత్రంతోనే అందాలతో ఆడియెన్స్‌ మతి పోగొట్టాలని పక్కాగా ప్లాన్‌ చేసుకున్నట్టుంది సారా. ఈ బ్యూటీ బాలీవుడ్‌ డైరెక్టర్‌ క‌ర‌ణ్ జోహార్ నేతృత్వంలో టైగ‌ర్ ష్రాప్ స‌ర‌స‌న నాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. సారా అలిఖాన్‌ ఈ సినిమాలో ఏకంగా మూడు సార్లు బికినీ లో కనిపించనుందట.

ఇదిలా ఉంటే…అందరి హీరోయిన్లలా కాకుండా బాలీవుడ్‌ లో డిఫెరెంట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆలియాభ‌ట్‌. ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ ని సంపాధించిన ఈ అమ్మ‌డు తొలి సినిమాతోనే గొప్ప న‌టి అన్న కాంప్లిమెంట్స్ అందుకుంది. అంత‌కుమించి అందాల్ని తెర‌పై పరిచేందుకు ఆడ్డులేదని తన తొలి సినిమాలొనే చెప్పేసింది. `స్టూడెంట్ ఆఫ్ ది ఈర్` చిత్రంలో మొద‌టి ఛాన్సుతోనే బికినీ వేసి వేడెక్కించేసింది.

Saif Ali Khan's Daughter Sara Ali Khan To Sport A Bikini

అయితే ఇప్పుడు సారా అలీఖాన్‌ కూడా అలియా భట్‌నే ఫాలో అవుతున్నట్టుంది. అందుకే అటు బికినీ లో కనిపించేస్తూ.. ఇటు లిప్‌లాక్‌ల‌తో కూడా ఈ అమ్మడు మ‌తులు చెడ‌గొడుతుంద‌ని తెలిసింది. ఏదేమైనా..అందాలు చూపించడంలో అభ్యంతరం లేదంటూ..బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ గా మారడానికి సారా వేట మొదలుపెట్టిందనే చెప్పాలి.

- Advertisement -