Devara:భైరాగా సైఫ్‌..లుక్ అదుర్స్

56
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఎన్టీఆర్‌కు విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ నటిస్తున్నారు. తాజాగా ఇవాళ సైఫ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో సైఫ్ ని తాము “భైరా” గా చూపిస్తున్నట్టుగా తెలిపారు మేకర్స్. మరి ఫుల్ లెంగ్త్ చిత్రంలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ సినిమా. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు.

Also Read:Kavitha:బీఆర్ఎస్..మన ఇంటి పార్టీ

- Advertisement -