43,624 ఓట్ల మెజార్టీతో సైదిరెడ్డి గెలుపు

523
saidireddy
- Advertisement -

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్  పద్మావతిపై 43,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికతో కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టిన టీఆర్ఎస్ ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ చరిత్రలో అత్యధిక మెజార్టీ సాధించిన నేతగా సైదిరెడ్డి రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు ఏడుసార్లు హుజుర్ నగర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా 2009లో 29,194 ఉత్తమ్ సాధించిన మెజార్టే ఇప్పటివరకు అత్యధికం.

ఉత్తమ్ రికార్డును 15వ రౌండ్‌లోనే దాటేశారు సైదిరెడ్డి. టీడీపీ,బీజేపీ డిపాజిట్లు కొల్పోగా ఇండిపెండెంట్ అభ్యర్ధి సుమన్‌ మూడో స్ధానంలో నిలిచారు.

- Advertisement -