హిట్ కోసం పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్న హీరో!

27
- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రానున్న సినిమా బ్రో. జులై 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ పీర్ దర్గాను సాయి తేజ్ దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన సాయి ధరమ్ తేజ్‌కు దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్.. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్‌ను కలిసేందుకు అక్కడి ప్రజలు ఉత్సాహం చూపారు. ఇదిలా ఉంటే.. సాయి ధరమ్ తేజ్ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సాయిధరమ్ తేజ్‌ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సాయి ధరమ్ తేజే నేరుగా దేవునికి హరితహాలిచ్చారు. ప్రస్తుతం ఆ పూజలు వివాదాస్పదంగా మారాయి. భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సినిమా సక్సెస్ అవ్వాలని శ్రీకాళహస్తిలో ఇక తప్పుడు పూజలు నిర్వహించిన సాయి ధరమ్ తేజ్ కి ఫలితం రాదు అని, ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భక్తులు సీరియస్ అవుతున్నారు.

Also Read:నాయకుడు’ గొప్ప ఆనందాన్నిచ్చింది: కీర్తి సురేష్

సరే ఈ వివాదం ఇలా జరుగుతూ ఉండగానే చిత్తూరు జిల్లా కాణిపాకంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కూడా సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అందరికీ శుభం కలగాలని వరసిద్ధి వినాయకుడిని కోరుకున్నట్లు సాయిధరమ్ తేజ్ తెలియజేశారు. మొత్తానికి జులై 28న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న బ్రో సినిమా హిట్ కోసం సాయిధరమ్ తేజ్ ఇలా వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు.

Also Read:మహా ఉద్యమంగా గ్రీన్ ఛాలెంజ్:ఎంపీ సంతోష్

- Advertisement -