లైంగిక వేధింపులపై సంచలన కామెంట్స్

65
- Advertisement -

‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది హీరోయిన్ అంకిత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంకిత.. తన కెరీర్ లో జరిగిన అనేక విషయాలను బయటపెట్టింది. తాను నటించిన విజయేంద్రవర్మ సినిమా ప్లాఫ్ కావడంతో సినిమాల నుంచి తప్పుకున్నానని స్పష్టం చేసింది. అలాగే తనకు, హీరో నవదీప్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ పరిశ్రమలో తనకు మంచి స్నేహితులని, అయితే వారిద్దరూ ఇప్పుడు లేరని చెప్పింది. అలాగే, అంకిత ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల పై కూడా సంచలన కామెంట్స్ చేసింది.

ఇంతకీ, అంకిత ఏం మాట్లాడింది అంటే.. ‘అవును, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నది వాస్తవం. నేను మొదట మోడలింగ్‌ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను. పలు TV ప్రకటనలు, సినిమాలు చేశా. ఈ క్రమంలో నన్ను ట్రాప్ చేయడానికి కొందరు ట్రై చేశారు. ఎదుటవ్యక్తి ఉద్దేశాలేంటో అప్పుడు నేను గుర్తించలేకపోయాను. కాలక్రమేణా అర్థమై వాళ్లకు దూరంగా ఉండడం మొదలుపెట్టాను. ఆ తర్వాత వాళ్లు నాకు అవకాశాలు ఇవ్వటం మానేశారు. చాలా బాధేసింది. అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాను అని అంకిత చెప్పుకొచ్చింది.

Also Read:రైతులను చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే..

అంకిత ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమాలు అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. అవకాశం వస్తే మళ్లీ సినిమాలు చేయాలని ఉంది. కానీ, ఛాన్స్ ల కోసం ఇప్పుడు నేను మళ్ళీ దర్శక నిర్మాతలు చుట్టూ తిరుగుతూ కూర్చోలేను.’నా కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. నేను ఎప్పుడూ రిస్క్ తో కూడిన పాత్రలను చేయడానికి ఇష్టపడుతాను. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ, వాటిల్లో మంచి స్క్రిప్ట్‌ ఉన్నవి కొన్నే వస్తున్నాయి. ఆ కొన్నింటిలో నాకు ఛాన్స్ వస్తే కచ్చితంగా నటిస్తాను’ అంటూ అంకిత అన్నారు.

Also Read:మహా ఉద్యమంగా గ్రీన్ ఛాలెంజ్:ఎంపీ సంతోష్

- Advertisement -