తేజూ…ప్రతిరోజూ పండగే అప్‌డేట్స్‌

583
sai dharam tej
- Advertisement -

చిత్రలహరి తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్‌ చేస్తున్న మూవీ ప్రతిరోజూ పండగే. కమర్షియల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా తేజూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. రేపు(బుధవారం) రాత్రి 8 గంటలకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘వేలు విడువని బంధం’ అనేది ట్యాగ్‌ లైన్‌.

చాలా రోజుల తరువాత చిత్రలహరి సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చిన తేజూ, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -