పూర్తిగా కోలుకున్న సుప్రీం హీరో..

27
sai dharam

గత నెలలో బైక్ యాక్సిడెంట్‌లో తీవ్రగాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కోలుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న తేజ్‌…త్వరలోనే కొత్త చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారు.

ముఖంపై తగిలిన గాయాలు తగ్గుముఖం పట్టడంతో కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ‘రిపబ్లిక్’ సినిమాతో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్న సాయిధరమ్ తేజ్.. తదుపరిగా ఓ మిస్టికల్ థ్రిల్లర్ లో నటించబోతున్నారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖాయం చేయలేదు. కొత్త దర్శకుడు కార్తిక్ దండు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సుకుమార్ స్ర్కీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను బీ.వీ.యస్.యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.