పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై సైకో హల్‌ చల్‌..

136
Punjagutta Flyover
- Advertisement -

హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఫ్లైఓవర్‌పై ఓ యువకుడు హల్‌ చల్‌ చేశాడు. ఫ్లైఓవర్‌పై నుంచి దూకి ఆత్మ హత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే అది గమనించిన ఓ పోలీసులు అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆ సైకోను రక్షించాడు. వివరాల్లోకి వెళ్లితే.. మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి పంజగుట్ట సర్కిల్‌లోని ట్రాఫిక్‌ అడ్వర్టయిజ్ మెంట్ బాక్సు పైకెక్కిన ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే అంతలో అటుగా బస్సు రావడంతో దానిపై పడిపోయాడు. ఫ్లైఓవర్‌ కొక్కేనికి అతడు ముడివేసిన తాడును ఓ పోలీసు అధికారి తొలగించడంతో అతడు ఉరివేసుకునే వీల్లేకపోయింది. దాంతో అక్కడ నిలిపిన బస్సుపై పడిపోయాడు. అతడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

- Advertisement -