‘స‌మ్మ‌త‌మే’ టైటిల్ పోస్ట‌ర్‌ విడుద‌ల..

160
Sammathame
- Advertisement -

‘రాజావారు రాణివారు’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై ఆక‌ట్టుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్‌కు ‘స‌మ్మ‌త‌మే’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘క‌ల‌ర్ ఫొటో’లో హీరోయిన్‌గా త‌న క్యూట్ ప‌ర్ఫార్మెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చాందిని చౌద‌రి ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం జోడీగా న‌టిస్తున్నారు. యు.జి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కె. ప్ర‌వీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సోమ‌వారం ‘స‌మ్మ‌త‌మే’ టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఓ యువ‌తి స్తంభానికి క‌ట్టేసి ఉంటే, వెనుక శ్రీ‌కృష్ణుడు క‌నిపిస్తున్నాడు. చాలా ఆహ్లాద‌క‌రంగా ఆక‌ట్టుకుంటోంది ఈ పోస్ట‌ర్‌. “ల‌వ్ ఈజ్ అన్‌కండిష‌న‌ల్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిట‌నే ఆస‌క్తి రేకెత్తుతోంది. స‌మ్మ‌త‌మే అంటే అంగీకారం అనే విష‌యం మ‌న‌కు తెలుసు. ల‌వ్ డ్రామా మేళ‌వించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, స‌తీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. విప్ల‌వ్ నైష‌దం ఎడిట‌ర్ కాగా, సుధీర్ మాచ‌ర్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. త్వ‌‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను చిత్ర బృందం వెల్ల‌డించ‌నున్న‌ది.

తారాగ‌ణం:కిర‌ణ్ అబ్బ‌వ‌రం, చాందిని చౌద‌రి
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత‌: కె. ప్ర‌వీణ‌
బ్యాన‌ర్‌: యు.జి. ప్రొడ‌క్ష‌న్స్‌
మ్యూజిక్‌: శేఖ‌ర్ చంద్ర‌
ఎడిటింగ్‌: విప్ల‌వ్ నైష‌దం
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీష్ రెడ్డి మాసం
ఆర్ట్‌: సుధీర్ మాచ‌ర్ల‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్

- Advertisement -