సాయి సుశాంత్‌ ‘ఫీలర్‌ వీడియో’ విడుదల..

226
Sai Sushanth Reddy
- Advertisement -

‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. ఇప్పుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్‌ రూపొందుతుంది. సాయిసుశాంత్‌ రెడ్డి ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో భైరవ్‌ పాత్రలో కనిపించ‌నున్నారు సాయి సుశాంత్‌.

ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రమోద్‌ కుమార్, రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి రోహిత్‌ తంజావూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌లో మూడో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ‘ఫీలర్‌ వీడియో’ను శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డిఫరెంట్‌ లొకేషన్స్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫీలర్‌ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకేత్తించేలా ఉంది.

హీరో: సాయిసుశాంత్‌ రెడ్డి
సాంకేతిక విభాగం
దర్శకత్వం: రోహిత్‌ తంజావూర్‌
నిర్మాతలు: ప్రమోద్‌కుమార్, రాజు
బ్యానర్‌: ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌
డీఓపీ: కె. సిద్దార్థ రెడ్డి
పీఆర్‌వో: వంశీ– శేఖర్‌

https://twitter.com/SaiSushanthR/status/1416002616312492037
- Advertisement -