మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న హీరో సాయి శ్రీనివాస్..

67
Sai Sreenivas

హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఛత్రపతి’ రీమేక్‌ అవుతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రీమేక్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇటీవలే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ సినిమా సెట్‌ వేసిన లొకేషన్‌లోనే ‘ఛత్రపతి’ సినిమా హిందీ రీమేక్‌ కోసం ఓ పెద్ద సెట్‌ను క్రియేట్‌ చేశారు.

ఈమూవీ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ జిమ్‌లో గట్టిగానే వర్క్‌అవుట్‌ చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. ఇక హిందీ భాషపై పట్టు సాధించే పని కూడా చేస్తున్నాడు. ఈ మాటలన్నీ ఆయన చెప్పినవే. ఇలా బాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించడానికి శ్రీనివాస్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. దూకుడు మీదే ఉన్న ఈ కుర్రాడు అక్కడ ఎన్ని మార్కులు తెచ్చుకుంటాడో చూడాలి మరి.