ఇకపై అలాంటి పొరపాట్లుచేయను..రౌడీ బేబి..!

116
sai pallavi

అందం, అభినయంతో యూత్‌ మనసుని కొల్లగొట్టింది మలయాళం బ్యూటీ సాయిపల్లవి. ‘భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల’.. అంటూ కుర్రకారుని ‘ఫిదా’ చేసింది.మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ధనుష్‌తో మరి2లో రౌడీ బేబీ సాంగ్‌తో యూ ట్యూబ్‌ని షేక్ చేసిన ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తెలుగులో తాను చేసిన మూడు సినిమాలు ఒకే కాన్సెప్ట్‌తో ఉన్నాయని ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని తెలిపింది. ముందు ప్రేమించుకోవడం, తరువాత విడిపోవడం, ఆఖరికి కలుసుకోవడం. ‘ఫిదా’, ‘ఎంసిఏ’, ‘పడిపడి లేచే మనసు’ సినిమాల్లో కొంచెం అటూ ఇటూగా కథ ఇలాగే ఉంటుందన్నారు. ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాను.. వెల్లడించింది.

తనకు పెళ్లిపై నమ్మకం లేదని, అసలు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టింది. ఎప్పటికీ సింగిల్‌గానే ఉండి, తన తల్లిదండ్రులను చూసుకోవాలని అనుకుంటున్నానని తెలిపింది.

అయితే గతంలో సహజీవనం తన వ్యక్తిగత అంశమని నటిగా మారాక నటనను ప్రేమిస్తున్నానని తెలిపిన ఈ బ్యూటీ తాను కోరుకునేది వైవాహిక జీవితాన్నే అని వెల్లడించింది. అయితే ప్రస్తుతం పెళ్లిచేసుకునే ఉద్దేశం లేదని జీవితాంతం కన్నెగానే ఉంటానని చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.