‘ఫిదా’ చిత్రం ద్వారా తెలుగు తెరకు తొలిసారి పరిచయం అయిన తమిళ నటి సాయి పల్లవి సహజ అందాన్ని చూసి ఇటు తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులు నిజంగా ఫిదా అవుతున్నారు.2015లో వచ్చిన ‘ప్రేమమ్’ అనే మలయాళ చిత్రం ద్వారా తొలిసారిగా సినీరంగ ప్రవేశం చేసిన పల్లవి అదే మలయాళంలో 2016లో విడుదలైన కాళి చిత్రంలో నటించి ఎంతో పేరు తిచ్చుకున్నారు. మూడవ చిత్రం ‘ఫిదా’ ద్వారా ఆమె తెలుగు తెరకు తొలిసారిగా పరిచయం అయ్యారు. సహజ సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చే పల్లవి తెలుగు చిత్రంలో కూడా పౌడరు తప్ప మేకప్ లేకుండా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది సాయి పల్లవి. ఆ సినిమాలో ఆమె పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. తెలంగాణ భాషలో ఆమె చెప్పిన డబ్బింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు మరోసారి ఆమెతో డబ్బింగ్ చెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి డి.వి. కృష్ణస్వామీ నిర్ణయించుకున్నారు. దుల్కర్, పల్లవి ఇద్దరికీ కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉండడంతో ఈ మలయాళం సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన మలయాళ చిత్రం ‘కలి’ తెలుగులో అనువదిస్తున్నారు.
తెలుగు వెర్షన్ కు గాను ఆమెను డబ్బింగ్ చెప్పమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆమె డబ్బింగ్ చెబితే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.ప్రస్తుతం తెలుగు అనువాదానికి సంబంధించిన డబ్బింగ్, మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా టైటిల్, లోగోను విడుదల చేయనున్నట్లు తెలిపింది. సెప్టెంబరులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొంది. గోపీసుందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. సమీర్ తాహీర్ దర్శకుడు. అయితే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి అంగీకరిస్తుందా.. లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని వేచి చూడాల్సిందే..