ఆ ఒక్కటే నాకు నచ్చదు…

204
Rajini calls for talks to end stir on wage issue
- Advertisement -

సమ్మె కారణంగా తమిళ చిత్రాల షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.  సమ్మె అనే మాటే తనకు నచ్చదని చెప్పుకొచ్చారు. చర్చల ద్వారా పరిష్కారమార్గాన్ని కనుక్కోవచ్చని, ఓ సీనియర్ నటుడిగా దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సంఘాల సమాఖ్య (ఫెప్సీ), తమిళ నిర్మాతల మండలికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

సమస్య ఏదైనా.. ఇగోలను పక్కనబెట్టి ప్రజల బాగు గురించి ఆలోచించాలని.. చర్చల ద్వారా ఎప్పుడూ ఓ పరిష్కారాన్ని కనుక్కోవాలన్నారు.

విశాల్‌ ఆధ్వర్యంలోని తమిళ నిర్మాతల మండలి ఇటీవల ఫెప్సీలో సభ్యులు కాని టెక్నీషియన్లను నిర్మాతలు తమ చిత్రంలో తీసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు వర్కర్స్‌కు తగిన డబ్బులు చెల్లించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని అయితే కొందరు ఫెప్సీ వర్కర్స్‌ ఇష్టారీతిన రెమ్యునరేషన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారని దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఓ ప్రకటనలో మండలి పేర్కొంది.

ఫెప్సీలో దాదాపు 25,000 మంది సభ్యులున్నారు. మరోవైపు ఫెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి కార్మికుల జీతాలను పెంచాలని కోరుతూ తాము చేస్తున్న డిమాండ్‌ నెరవెరక పోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు.  మంగళవారం నుంచి సమ్మెకు దిగడంతో ఫెప్సీలో సభ్యులుగా ఉన్న కార్మికులు ఎవరూ చిత్రీకరణల్లో పాల్గొనలేదు.

- Advertisement -