విజయ్‌తో పల్లవి..ప్రేమకథ!

9
- Advertisement -

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో జత కట్టనుంది నటి సాయి పల్లవి. రవి కిరణ్ కోల దర్శకత్వంలో ప్రేమ కథా చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటులు. ఇద్దరూ మంచి క్రేజ్ ఉన్న నటులు కాగా వెండితెరపై అలరించడం అభిమానులకు కన్నుల పండగనే చెప్పాలి.

ఫిదా చిత్రంతో తెరంగేట్రం చేశారు సాయి పల్లవి. సహజ నటనతో అనతికాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందారు సాయి పల్లవి. టాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరిగా నిలిచింది. ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తోంది.

ఇక రౌడీ బాయ్‌గా పేరు తెచ్చుకున్న విజయ్…రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చినా అది ప్రేక్షకుల ముందు పెద్దగా ఆకట్టుకోలేదు. గీత గోవిందం తర్వాత విజయ్‌కు ఆశీంచిన స్థాయిలో హిట్ సినిమాలు లేవు. కమ్ బ్యాక్ కోసం విజయ్ ఎంతగానో ఎదురుచూస్తుండగా ఈ ప్రేమ కథా చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.

Also Read:Modi:భారత్‌కు ఆత్మ ఎన్డీయే

- Advertisement -