ఎన్టీఆర్‌తో రౌడీ బేబి రొమాన్స్‌..!

322
sai pallavi ntr

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం ఇప్పటికే పలువురు తారల్ని ఎంపిక చేశారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ తారలు కూడా కీలక పాత్రలు దక్కించుకున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ సరసన ఆలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎన్టీఆర్‌ కోసం బ్రిటిష్‌ భామ డైసీని ఎంపిక చేశారు. కానీ ఆమె ఆరంభంలోనే తప్పుకుంది. దీంతో అప్పటినుంచి ఎన్టీఆర్‌కు జోడిని ఎంపికచేసే పనిలో పడ్డారు జక్కన్న.

ఈ నేపథ్యంలో తొలుత నిత్యామీనన్ పేరు బలంగా వినిపించింది. ఆ తర్వాత కథకు తగ్గట్టుగా మళ్లీ బ్రిటిష్ భామ కోసమే జక్కన్న వేట మొదలైందనే టాక్ వచ్చింది. అవ్వన్నీ పక్కనబెట్టి ఇప్పుడు లేడీ నాచురల్ స్టార్ సాయి పల్లవి పేరు వినిపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

ఇందుకోసం కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్‌ జోడి పాత్రను భారతీయ యువతిగా మార్చేశారట. సాయి పల్లవిని బెటర్ ఆప్షన్ అని భావించిన చిత్రయూనిట్ ఇటీవలే ఆమెను సంప్రదించినట్టు టాక్. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి నటిస్తే వారిద్దరి చిందులతో స్టేజీ ఎలా దద్దరిల్లిపోతుందో ఊహించుకోండి.