నెట్టింట వైరల్‌గా సాయి పల్లవి ఫొటో!

65
- Advertisement -

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన బోనాల పండగ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవలె విరాటపర్వంతో హిట్ కొట్టిన దర్శకుడు వేణు ఊడుగుల బోనాల శుభాకాంక్షలు తెలిపారు. విరాట‌ప‌ర్వం సినిమాలోని సాయి పల్లవి బోనం ఎత్తిన స్టిల్స్ ను షేర్ చేసి.. అంద‌రికీ హ్యాపీ బోనం అని చెప్పి, గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక! అంటూ ట్వీట్ చేశారు.

దీంతో సాయి పల్లవి బోనం ఎత్తుకొని ఉన్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -