బద్మాష్.. బలిసిందారా!! బొక్కలిరగ్గొట్టేస్తా అంటూ పళ్లు బిగించి.. బిడికిలి ఎక్కుపెట్టి మెగా హీరో వరుణ్ తేజ్‌కు వార్నింగ్ ఇచ్చేస్తుంది ప్రేమమ్ బ్యూటీ సాయిపల్లవి. వరుణ్ తెజ్ మాత్రం మాత్రం కూల్‌గా జీవితాంతం ఆమెతోటే ఉండాలంటూ‘ఫిదా’ టీజర్‌లో కనిపించాడు. ఇందులోని డైలాగ్స్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. ఈ మూవీలో తమిళ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాలో చేస్తున్న క్యారెక్టర్‌కు బాగా సూటయ్యేలా సాయి పల్లవి వాయిస్ ఉండటంతో ఆమెతోనే డబ్బింగ్ కూడా చెప్పించాడు డైరెక్టర్. తాజాగా సాయి పల్లవి డబ్బింగ్ చెప్పిన ఓ వీడియో బైట్ విడుదల చేశారు. తెలుగు బాష తెలియని సాయి పల్లవి డబ్బింగ్ చెప్పేందుకు చాలానే కష్టపడింది. అది కూడా తెలంగాణ స్టైల్లో ‘బాడ్కోవ్ బలిసిందారా… బొక్కలిరగ్గొడతా, బద్మాష్ బలిసిందారా… బొక్కలిరగ్గొడతా’ అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. వరుణ్ తేజ్ ఎన్నారైగా కనిపించనున్న ఈ సినిమాలో సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా కనిపించనుంది.
ఫిదా చిత్రం సాయి పల్లవికి తొలి మూవీ కాగా, ఈ సినిమాకి తనే ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది. శేఖర్ కమ్ముల దగ్గరుండి మరి సాయి పల్లవితో డైలాగులు చెప్పించినట్టు వీడియోలో చూపించారు. విడుదలైన కొద్ది గంటలలోనే ఈ వీడియోకి మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందమైన ప్రేమ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శక్తికాంత్ సంగీతం అందిస్తుండగా త్వరలోనే ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.