హీరోయిన్స్‌ పై బన్నీ కామెంట్స్‌..

229
- Advertisement -

సరైనోడు సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, తన నెక్ట్స్ సినిమా దువ్వాడ జగన్నాథమ్‌తో ముందుకువస్తున్నాడు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రాకింగ్‌ స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డీజే సినిమాకు సంబంధించి ప్రమోషన్ బాగానే చేస్తున్నాడు బన్నీ. తాజాగా పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. అయితే సాధారణంగా చాలా ఇంటర్వుల్లో సినిమాలకు సంబంధించిన విశేషాలే చెప్పుకొంటూ వచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాత్రం అల్లు అర్జున్ కు ఓ టిపికల్ ప్రశ్నే వేసింది. హీరోల్లో స్టైల్ కు ఐకాన్ గా పేరు తెచ్చుకున్న మీరు హీరోయిన్ల స్టైల్‌లో ఎవరు నచ్చుతారని అడిగింది.

Bunny Comments On Hot Heroines

దీనికి బన్నీ ఇలా సమాధానమిచ్చాడు. శారీస్ లో తమన్నా అద్భుతంగా ఉంటుంది. చీరకట్టులో ఆమె నడుము ఒంపులు చూస్తే మతిపోతుంది. రచ్చ సినిమాలో ఆమెను చూస్తే చాల అందంగా అనిపించింది అంటూ కితాబిచ్చేశాడు. ఇక నాజూకు సుందరి ఇలియానా వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో చాలా బాగుంటుంది. అలాంటి డ్రస్సుల్లో ఆమె నడుము ఎక్స్ పోజ్ చేస్తే చూడచక్కగా ఉంటుందని చెప్పాడు. సమంత అయితే అటు వెస్ట్రన్ వేర్ లో… ఇటు ఎథ్నిక్ వేర్ లోనూ ఆకట్టుకోగలదు. కాజల్ కూడా వెస్ర్టన్ వేర్ లో చూడచక్కగా ఉంటుంది అని బన్నీ ఓపెన్ గా ఒపీనియన్ పంచుకున్నాడు. స్క్రీన్ పై లేటెస్ట్ గా జతకట్టిన పూజా హెగ్డే గురించి చెబుతూ చాలామందికి షార్ట్ డ్రస్సులు నప్పవు. పూజా పొడుగుకాళ్ల సుందరి కాబట్టి ఆమె షార్ట్ డ్రస్సుల్లోనూ అదరగొట్టేస్తుందని చెప్పాడు.

Bunny Comments On Hot Heroines

చలపతిరావు ఆడవాళ్ల గురించి కామెంట్‌ చేసినప్పటినుండి ఆడవాళ్ల గురించి మాట్లాడేటప్పుడు అంతా ఆచితూచి మాట్లాడుతున్నారు.గతంలో ఆలీ కూడా ఇలాగే సమంత నడుమును బెంజ్ సర్కిల్ తో పోల్చి పెద్ద వివాదానికి తెరలేపాడు. ఇప్పుడు బన్నీ హీరోయిన్ల నడుము ఒంపుల గురించి మాట్లాడేశాడు. మరి బన్నీ వ్యాఖ్యలను జనాలు ఎలా స్పందిస్తారో. దువ్వాడ జగన్నాథమ్ జూన్‌ 23న థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

- Advertisement -