‘తేజ్ ఐ ల‌వ్ యూ’ మేకింగ్ వీడియో….

387
Tej-I-Love-U
- Advertisement -

సాయి ధ‌ర‌మ్ తేజ్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌రన్ జంట‌గా న‌టించిన సినిమా తేజ్ ఐ లవ్ యూ. నిన్న ఈసినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ల‌వ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో తెర‌కెక్కిన ఈసినిమాకు ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్ గా పేరుగాంచిన కరుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..కేఎస్ రామారావు నిర్మించారు. ప్ర‌స్తుతం ఈసినిమా పాజిటివ్ తాక్ తో దూసుకెళ్తుంది.

tej i love u movie team

ఈసినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ పూర్తి స్ధాయిలో ల‌వ‌ర్ బాయ్ గా న‌టించాడు.. సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌తంలో న‌టించిన ఐదు సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో ఈసినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈసినిమాతో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు మంచి హిట్ వ‌స్తుంద‌ని న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. డైర‌క్ట‌ర్ క‌రుణాక‌ర‌న్ కూడా ఈసినిమాపై ఆశ‌లు పెట్టుకున్నాడు.

ఈసినిమా కొంచెం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుండ‌టంతో ఉపిరిపిల్చుకున్నారు చిత్ర‌యూనిట్. ఇక ఈసినిమాకు గోపి సుంద‌ర్ సంగీతం అందిచారు. ఈసినిమాలో జోష్ ర‌వి, వైవా హ‌ర్ష ప‌లువురు న‌టీన‌టులు న‌టించారు. ఇక ఈసినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను ఇటివ‌లే విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్..

- Advertisement -