సినీ తారలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కొత్తేమీకాదు. తమ సంపాదనలో కొంత భాగాన్ని చాలా మంది సినీ నటులు సేవా కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. వీరిలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఒకరు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు ఎంతోమందికి సేవనందించారు. వీరిబాటలోనే తేజు తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.
I have been associated with thinkpeaceorg for the past couple of years and I’ve Adopted an Aksharalaya school in munniguda and sponsored the education and nutrition of over 100 kids over a period of two years…it’s… https://t.co/yW4lEA0gn9
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 9, 2019
రెండు సంవత్సరాల క్రితం మున్నిగూడలోని అక్షరాలయ స్కూల్‌ను దత్తత తీసుకున్నారు సాయిధరమ్ తేజ్. రెండు సంవత్సరాలకు గాను 100 మంది విద్యార్థులకు సంబంధించిన చదువుతో పాటు వారికి కావాల్సిన ఫుడ్‌ని అందించారు తేజు. థింక్ పీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తేజ్ చేపట్టారు. రెండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా తేజ్‌కు థ్యాంక్స్ చెప్పింది థింక్ పీస్ స్వచ్చంద సంస్థ. మరిన్ని సంవత్సరాలు అక్షరాలయ స్కూల్‌ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు తేజు. చిన్నారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వారికి మంచి చదువు అందించడం కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానని తెలిపారు తేజు.
చిత్రలహరి సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వెరైటీ కథలను, ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించగల మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే మూవీ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తేజ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.