కత్తికి కౌంటరిచ్చిన సుప్రీం హీరో

198
Sai Dharam Tej counters Kathi Mahesh
- Advertisement -

కత్తి మహేష్..  తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు పరిచయం అవసరంలేని పేరు . బిగ్ బాస్ అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.అయితే మిగతా మరికొద్దిమందికి ఎందుకు తెలియకూడదులే అని అనుకున్నాడో ఏమో కాని ఏకంగా సినీనటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు ఒక నటుడే కాదు, అతనికి నటించడం రాదంటూ వాఖ్యలు చేసి తెలుగు రాష్ట్రాల మొత్తం వైరల్ అయ్యాడు. దీంతో  కత్తి మహేశ్‌- పవన్‌ కల్యాణ్‌ అభిమానుల మధ్య వివాదం ఎడతెగకుండా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా  కత్తి మహేశ్‌ పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా ప్రెస్‌మీట్‌ పెట్టి.. కొన్ని ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. నటి పూనమ్‌ కౌర్‌కు ఆయన ఆరు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో సినీ మాటల రచయిత కోన వెంకట్‌ రంగంలోకి దిగి.. ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు ఆరంభించినట్టు కనిపిస్తోంది. ఈ నెల 15వ తేదీ వరకు ఎవరూ మాట్లాడవద్దని, కత్తి మహేశ్‌ సైతం టీవీ చర్చలకు వెళ్లకూడదని కోన సూచించారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా పరోక్షంగా కత్తి మహేశ్‌ను ఉద్దేశించి మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అయింది.

ఓ టీవీ చానెల్‌ చర్చలో తన తల్లిని వివాదంలోకి లాగే ప్రయత్నం చేయడంతో కత్తి మహేశ్‌ ఆ కార్యక్రమంలో మధ్యలోనుంచే వాకౌట్‌ చేశారు. ఈ అంశానికి స్పందన అన్నట్టుగా ’హహ్హహ్హా’అంటూ స్మైలీ ఏమోజీలతో తేజూ ఓ ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే నెటిజన్లు ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ను చేస్తూ.. ఇది కత్తి మహేశ్‌ వాకౌట్‌పై స్పందనే అంటూ కామెంట్లు పెట్టారు. కత్తి మహేశ్‌ను తూలనాడుతూ పలువురు నెటిజన్లు ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తున్నారు.

- Advertisement -