సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా `నేను శైలజ` ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న చిత్రం `చిత్రలహరి`. సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – “కిషోర్ తిరుమల సినిమా అంటే క్యూట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే ఎమోషన్స్ క్యారీ అవుతుంటాయి. అలాంటి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌తో చిత్రలహరి తెరకెక్కుతోంది. షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్రకారం జరుగుతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సాయిధరమ్ తేజ్‌ను సరికొత్త యాంగిల్‌లో కిషోర్ తిరుమల ప్రెజంట్ చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నాం“ అన్నారు.
దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ – “మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా చిత్రలహరి తెరకెక్కుతోంది. టైటిల్‌లో ఐదు అక్షరాలు ఉన్నట్లు సినిమాలో ఐదు క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటాయి. సినిమా ఈ పాత్రల చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది“ అన్నారు.
సాయిధరమ్‌తేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.