జూలై 6న వస్తోన్న ‘తేజ్‌’. ఐ లవ్‌ యు

286
Tej-I-Love-You-
- Advertisement -

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు, వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక.

Anupama-Parameswaran-says-to-Sai-Dharam-Tej-I-Love-You

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. జూన్‌ 16న మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో ఈ చిత్రం ఆడియో సక్సెస్‌మీట్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చెయ్యబోతున్నారు. ‘తొలిప్రేమ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్‌’ వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి లవ్‌ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ రూపొందుతోంది. జూలై 6 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Anupama-Parameswaran-says-to-Sai-Dharam-Tej-I-Love-You

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

- Advertisement -