త‌మిళ‌నాడు ముఖ్యమంత్రితో భేటీ కానున్న సీఎం కేసీఆర్..

71
- Advertisement -

శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స్వామి వారి ద‌ర్శ‌న అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆల‌య ద‌ర్శ‌నానికి రావ‌డం ఇది రెండోసారి అని తెలిపారు. డీఎంకే ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డంతో ఇదే తొలిసారి అని చెప్పారు. రేపు సాయంత్రం త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తో స‌మావేశం అవుతాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

త‌మిళ‌నాడు తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాల‌తో రంగ‌నాథ స్వామి ఆల‌య పండితులు సీఎం కేసీఆర్ కు పూర్ణ‌కుంభంతో ఆహ్వానం ప‌లికారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు గ‌జ‌రాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంత‌కుముందు తిరుచ్చి క‌లెక్ట‌ర్ శ్రీనివాసు, త‌మిళ‌నాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్‌కు స్వాగతం ప‌లికి ఆల‌యంలోకి తీసుకెళ్లారు.

- Advertisement -