నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరి అరెస్టు..

220
actress Sravani
- Advertisement -

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవ్‌రాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రేమ పేరిట దేవరాజ్‌వేధింపులే శ్రావణి ఆత్మహత్యకు కారణమని సాయి ఆరోపిస్తుండగా, సాయి వేధింపుల వల్లే మృతి చెందిందని దేవరాజ్‌ ఆరోపించారు.

తమ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఈ ఇద్దరు ఫోన్‌రికార్డులను ఇద్దరూ బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే సాయి, దేవరాజ్‌లను పోలీసులు విచారించారు. వీరిద్దరిని రేపు మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాత అశోక్‌ రెడ్డి సోమవారం పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే శ్రావణి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డు చేశారు.

- Advertisement -