బాలీవుడ్ లోకి టాలీవుడ్ యంగ్ హీరోయిన్

374
Rashmika Mandana

ఛలో మూవీతో తెలుగు తెరకి పరిచయమైన రష్మీక మందన తన అందం, నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీత గోవిందం మూవీతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా అమ్మడు కన్నడలో కూడా చాలా బిజీ అయిపోయింది. ఆ తర్వాత నాని సరసన దేవదాస్ మూవీలో నటించింది. ప్రస్తుతం రష్మీక చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.

మహేశ్ బాబు, నితిన్, అఖిల్, అల్లు అర్జున్, కార్తీ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఇప్పడు తాజాగా మరో లక్కి ఆఫర్ ను కొట్టేసింది రష్మీక. బాలీవుడ్ హీరో సంజయ్ లీలా బన్సాలీ ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మీక ను తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈమూవీలో రణదీప్ హుడా హీరోగా చేస్తున్నాడు. బల్విందర్ సింగ్ అనే నూతన దర్శకుడు ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ఎంట్రీతోనే మెగా ఫోన్ పట్టేయడంతో సంతోషంగా ఉంది రష్మీక. టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి.