ఆ ఘనత పొందిన తొలి తెలుగు సినిమా..సాహో

1042
- Advertisement -

సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాహో. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆగస్టు 30న ప్రేక్షకుల మందుకురానుంది.

ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇక సినిమా విడుదలకు ముందే సంచలనాలకు కేరాఫ్‌గా మారింది సాహో. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్ము దులిపిన సాహో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ సత్తాచాటుతోంది. తాజాగా సాహో ట్విట్టర్ ఎమోజి సింబల్ పొందిన తొలి తెలుగు సినిమాగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు ది లయన్ కింగ్, అవెంజర్స్, స్పైడర్ మాన్, సల్మాన్ భారత్ వంటి చిత్రాలకు ఎమోజిలు తయారుచేసింది ట్విట్టర్‌. ఇప్పుడు సాహో చిత్రానికి కూడా ట్విట్టర్ ఎమోజి ఇవ్వడంతో చిత్రయూనిట్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -