బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా సాహో. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలిరోజు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా కొన్ని చోట్ల జోరు కొనసాగిస్తే మరికొన్ని చోట్ల వీక్ కలెక్షన్స్‌ను రాబట్టింది.
అయితే చెన్నై సిటీలో సాహో తమిళ్, తెలుగు, హిందీ భాషలలో కలిపి మొత్తం 73లక్షల గ్రాస్ సాధించింది. ఒక్క తెలుగు వర్షన్‌లో 32లక్షల గ్రాస్ వసూళ్లతో అల్ టైం తెలుగు హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటివరకు మహేష్ భరత్ అనే నేను మూవీ పేరిట ఉన్న 27లక్షల రికార్డు ని ఈ చిత్రం అధిగమించింది.
ఇక ఓవర్ అల్ గా తమిళ నాడు రాష్ట్రంలో మూడు భాషలకు గాను మొదటి రోజు సాహో దాదాపు 4కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. అమెరికా ప్రీమియర్‌లో 9,15,224 డాలర్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు తెలిపారు. అయితే పంపిణీదారులు చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేశారని, ఈ వసూళ్లతో వారు షాక్ అయ్యారని పేర్కొన్నారు. ఓవరాల్‌గా యుఎస్‌లో ప్రీమియర్ వసూళ్లలో సాహో ఆరో స్థానంలో నిలిచింది.