ఆకట్టుకుంటున్న సాహో కొత్త పోస్టర్..!

394
sahoo
- Advertisement -

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం సాహో. సుజిత్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాషల్లో విడుదలవుతోంది. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని యువీ క్రియేషన్స్ నిర్మించగా ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమాకు సంబంధించి ఒక్కో అప్ డేట్ ఇస్తూ వస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. యాక్షన్‌ సీన్ నేపథ్యంలో విడుదల చేసిన ఈ పోస్టర్‌ అందరిని ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చేలా ఉన్న ఈ పోస్టర్‌తో అంచనాలను మరింతగా పెంచేసింది చిత్ర యూనిట్.

రెండు రోజుల క్రితం సాహో చిత్రానికి సంబంధించి రొమాంటిక్ పోస్ట‌ర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ భారీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు చెబుతున్నారు. సాహో చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

uv creations

- Advertisement -