సాహో ద‌ర్శ‌కుడితో అల్లు అర్జున్

611
Allu-Arjun director sujith
- Advertisement -

ద‌ర్శ‌కుడు సుజీత్ ప్ర‌స్తుతం రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో సాహా చిత్ర‌న్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈచిత్రంలో బాలీవుడ్ శ్ర‌ద్దా క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈచిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఆగ‌స్టు 15 ఈచిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. భారీ బ‌డ్జెట్ తో ఈచిత్రాన్ని తెర‌కెక్కించ‌డంతో అంతేస్ధాయిలో అంచ‌నాలు కూడా ఉన్నాయి. యాక్ష‌న్ నేప‌థ్యంలో ఈసినిమా సాగ‌నుంద‌ని స‌మాచారం. ద‌ర్శ‌కుడు సుజిత్ కుమార్ త‌న త‌ర్వాతి చిత్రానికి కూడా స‌న్నాహాలు చేస్తున్నాడు.

sujeth

ఆయ‌న తాజాగా అల్లు అర్జున్ కు ఒక లైన్ వినిపించాడ‌ట‌. బ‌న్నీకి క‌థ న‌చ్చ‌డంతో డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని చెప్పాడ‌ని ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం బ‌న్నీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. త్రివిక్ర‌మ్ మూవీ త‌ర్వాత సుజిత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. సుజీత్ కుమార్ గ‌తంలో శర్వానంద్ తో ర‌న్ రాజా ర‌న్ చిత్నాన్ని తెర‌కెక్కించారు. ఈసినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. బ‌న్నీ సుజిత్ కుమార్ కు ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి మ‌రి.

- Advertisement -