కంగనా బ్రూస్ లీ లా నటించిందిః వ‌ర్మ‌

292
KR-RGV
- Advertisement -

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న మ‌ణిక‌ర్ణిక మూవీ హీరోయిన్ కంగ‌నా రౌన‌త్ ట్వీట్ చేశారు. మ‌ణిక‌ర్ణిక చిత్రం సినిమా చూసిన త‌ర్వాత హీరోయిన్ల రూపంలో గ్రేట్ హీరో దొరికింద‌ని చెప్పారు. కంగనా ఉగ్రరూపం, ధీరత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్ లీ లాగా కంగనా నటించిందని మెచ్చుకున్నారు. ఆమె నటనతో పోలిస్తే హీరోలందరూ హీరోయిన్లుగా కనిపిస్తున్నారని వర్మ ట్వీట్ పెట్టాడు.

manikarnika

ఈసినిమాకు మొద‌ట క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఆయ‌న‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఆఫ‌ర్ రావ‌డంతో మ‌ణిక‌ర్ణిక మూవీని వ‌దిలేసుకున్నాడు. క్రిష్ వెళ్లిన త‌ర్వాత కంగ‌నా ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధురాలు ఝాన్సీ ల‌క్ష్మీబాయి జీవిత క‌థ ఆధారంగా ఈసినిమా తెర‌కెక్కింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈమూవీ బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది.

- Advertisement -