యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇప్పుడు ‘సాహో’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. విదేశీ వీధుల్లో పొగ మంచు మసకలో.. ముసుగు ధరించిన ప్రభాస్ నడిచి వస్తున్న పోస్టర్‌ను చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలోనే దర్శకుడు సుజిత్ దీనిని రూపొందిస్తున్నాడేమో అనిపిస్తుంది.
ఐదేళ్ల తర్వాత తమ అభిమాన హీరో స్టైలిష్ లుక్కులో కనిపించటంతో డార్లింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే… పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ ఎంటర్టైనర్లో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే..అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ఈ ఫస్ట్ లుక్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. దర్శకదిగ్గజం రాజమౌళి ‘సాహో’ ఫస్ట్ లుక్ పై స్పందించారు. కలర్స్, టెక్స్చర్స్ ను అద్భుతంగా వాడారని కితాబిచ్చారు. ‘సూపర్ స్టైలిష్ సాహో’ అంటూ ట్వీట్ చేశారు.
Beautiful usage of colours and textures.. Super Stylish Saaho.. #SaahoFirstLook pic.twitter.com/z5IK672wZB
— rajamouli ss (@ssrajamouli) October 23, 2017