పవన్‌ను హగ్‌ చేసుకున్న ఎన్టీఆర్‌..

297
- Advertisement -

త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్లో ఇది 28వ చిత్రం. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఈ ఉదయం రామానాయుడు స్టూడియోస్‌ లో చిత్ర ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది.

 Pawan -NTR on the same stage

సినిమా పూజా కార్యక్రమాలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రాగా, హీరో ఎన్టీఆర్ స్వయంగా పవన్ కు ఎదురెళ్లి, ఆత్మీయ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఆపై కాసేపు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లాడారు. పవన్ చేతుల మీదుగా సినిమా ప్రారంభం అయింది.

ఈ నేపథ్యంలో రామానాయుడు స్టూడియోస్‌ లో సందడి నెలకొంది. వందలాది మంది ఎన్టీఆర్, పవన్, త్రివిక్రమ్ అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, కుమారుడు అభయ్‌ రామ్ లు సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ (వై దిస్ కొలవెరి ఫేం) తదితరులు హాజరయ్యారు.

- Advertisement -