సెల్‏ఫోన్ కోసం స్నేహితుడి హత్య..

209

నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. ఎంతకష్టమైనా సరే.. చివరికి అప్పు చేసైనా సరే ఫోన్లు కొంటున్నారు. మార్కెట్ లోకి వచ్చే కొత్త ఫోన్ పై కుర్రకారులు మనసు పారేసుకుంటారు. వాటి కోసం ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు. కానీ ఓ యువకుడు ఫోన్ కోసం దారుణానికి ఒడిగట్టాడు. తనకు నచ్చిన ఫోన్ ని దక్కించుకోవడం కోసం తన స్నేహితుడునే హత్య చేశాడు.

prem sager

 

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ రామంతపూర్ కు చెందిన దంపతులకు ప్రేమ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. ప్రేమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు. ప్రేమ తల్లిదండ్రులు నాటకాలు వేస్తూ, కాలీ సమయంలో దర్జీ పని చేస్తూ కొడుకును చదివిస్తున్నారు. అదే బస్తీకి చెందిన సాగర్ అనే యువకుడు, ప్రేమ్ కి స్నేహితుడు. ప్రేమ్ దగ్గర తనకు నచ్చిన ఫోన్ ఉండడం చూసిన సాగర్, దానిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు.

దానికి కోసం ఓ పతకం వేశాడు. ప్రేమ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్దామని తీసుకెళ్లాడు. రాత్రి అవుతున్నా కొడుకు ఇంటికి తిరిగిరాకపోవడంతో ప్రేమ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్తీలో ఆరా తీయగా, సాగర్ తో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లినట్లు తెలిసింది. సాగర్ ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసి, ఆదిభట్ల ప్రాంతంలో పెట్రోల్ పోసి కాల్చేశానని అంగీకరించాడు. ఫోన్ కోసమే ఈ హత్య చేశానని చెప్పాడు. విషయం తెలుసుకున్న ప్రేమ్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.