సచిన్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు

200
Sachin the worst performer
- Advertisement -

ఇండియా అంటే క్రికెట్… క్రికెట్ అంటే ఇండియా. ఇక్కడ ఎన్ని మతాలు ఉన్నా అందరి అభిమతం ఒక్కటే…. అదే క్రికెట్. ఈ ఆటను నరనరాన జీర్ణించుకున్న ఈ దేశంలో క్రికెట్‌ను మతంగా ఆరాధించడం చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఇలాంటి చోట కోట్లాది మంది క్రికెట్ అభిమానుల దేవుడుగా అవతరించాడు సచిన్ టెండూల్కర్.  ప్రతి భారతీయుడి నోట వినిపించే మొదటి పేరు సచినే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇంత పేరు తెచ్చుకున్న సచిన్ వివాదాల జోలికి ఎప్పుడు వెళ్లలేదు. సోషల్ మీడియా సైతం లిటిల్ మాస్టర్‌పై సెటైర్లు విసిరిన సందర్భాలు లేవు. కానీ సచిన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి విమర్శల పాలవుతునే ఉన్నాడు.2012లో రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయినా.. ఈ ఐదేళ్ల‌లో అత‌ను స‌భ‌లో వ‌చ్చి కూర్చున్న‌ది చాలా త‌క్కువ‌. 348 రోజులు స‌భ న‌డిస్తే.. మాస్ట‌ర్ వ‌చ్చింది కేవ‌లం 23 రోజులు.

ఈ నేపథ్యంలో సచిన్ రాజీనామా డిమాండ్ అంశం తెరమీదకు వచ్చింది. దీంతో సచిన్ ఎట్టకేలకు రాజ్యసభకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో నెట్టింట్లో సచిన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. ఎవ‌రికి తోచిన కామెంట్స్ వాళ్లు పెట్టారు. అత‌న్ని స్కూల్ పిల్లాడితో ఒక‌రు పోలిస్తే.. రాజ్య‌స‌భ‌లో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ అంటూ మ‌రొక‌రు ట్వీట్ చేశారు.

ఇక సచిన్‌తో పాటు బాలీవుడ్ నటి రేఖ కూడా రాజ్యసభకు హాజరుకాని లిస్ట్‌లో ఉన్నారు.  వీరిద్దరూ వరసగా సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. సభ మొహమెరగకుండా కాలం గడిపేస్తున్నారు. దీనిపై సభలోనే పలుసార్లు చర్చ జరిగింది.

Sachin the worst performer

- Advertisement -