హ్యాపీ బర్త్ డే వెంకీ మామా: సచిన్‌

434
venkatesh
- Advertisement -

ఈ రోజు హీరో విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరూ సోషల్ మీడియా వేదికగా బర్త్‌ డే విషెస్‌ తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ తదితరులు వెంకీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందించారు. తాజాగా భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా వెంకటేష్‌కు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.

హ్యాపీ బర్త్ డే వెంకీ మామా అంటూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది విజయవంతంగా గడిచిపోవాలని, సంతోషం, ఆరోగ్యం కలగాలని సచిన్ టెండూల్కర్‌ ట్విట్లర్‌ ద్వారా తెలిపారు. ఇక టాలీవుడ్‌లో అత్యధిక శాతం విజయాలు నమోదు చేసుకున్న హీరోల్లో వెంకటేష్‌ ఒకరు. ఆయన నటించిన సినిమాల్లో ఫ్లాపులు చాలా తక్కువ. అందుకే విక్టరీని తన ఇంటి పేరు చేసుకుని విక్టరీ వెంకటేష్‌ గా పేరుతెచ్చుకున్నారు.

- Advertisement -