దేశం గర్వించే ప్రధాని పివి- మంత్రి కొప్పుల

172
Minister Koppula
- Advertisement -

అదివారం రామగుండం 39వ డివిజన్‌లో భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు శతజయంత్సోవాలు జరిగాయి. ఇందులో భాగంగా ఆర్.ఆర్. గార్డెన్‌లో తారా ఆర్ట్స్, విజయమ్మ పౌండేషన్ ఆధ్వర్యంలో భారతీయ సంప్రదాయ, సంస్కృతిక కాళాఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంతం నుండి ప్రధానిగా పదవిని చేపట్టిన మెదటి తెలంగాణ బిడ్డ పి.వి గారన్నారు. ప్రధానిగా పి.విగారు ఉన్న సమయంలో అనేక సంస్కరణలు తెచ్చి దేశాన్ని ముందుకు నడిపించిన మహనీయులన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పి.వి జయంత్సోవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. రామగుండం ప్రాంతంలోని కళాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబర్తి ఈ ప్రాంత ప్రతిష్ట పెంచారని తెలిపారు.

కళలకు రాజధానిగా రామగుండంమని, ఇక్కడి కళాకారులు అన్ని రకాల కళాల్లో రాణించగలన్నారు. ఈ ప్రాంత కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడి పెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్లు పెంట రాజేశ్, కన్నూరి సతీష్ కుమార్, పాముకుంట్ల భాస్కర్, బాల రాజ్ కుమార్, జెట్టి జ్యోతి, మేకల సదానందం, నాయకులు తానిపర్తి గోపాల్ రావు, అడ్డాల రామస్వామి, నూతి తిరుపతి, అచ్చెవేణు, నిర్వాహకులు సంకె రాజేష్, మ్యాజిక్ రాజా, దయనంద్ గాంధీతో పాటు కళాకారులు పాల్గొన్నారు.

- Advertisement -