- Advertisement -
కరోనాతో ఇంటికే పరిమితమైన క్రికెట్ లెజెండ్ ,టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీతో టైమ్‌ని స్పెండ్ చేస్తున్నాడు. ఇంటి పనులు, వంట పనులు చేస్తూ సరదాగా కాలం వెల్లదీస్తున్న సచిన్ తాజాగా చిన్నపిల్లాడిలా మారాడు.
దేశవ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురవగా ముంబైలోని తన ఇంటి ఆవరణలో వర్షాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశాడు సచిన్. సచిన్ వర్షంలో ఎంజాయ్ చేస్తుండగా సారా టెండూల్కర్ వీడియో తీసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టూ చేస్తూ కామెంట్ కూడా చేశాడు.
జీవితంలోని చిన్న సంతోషాన్ని తాను ఆస్వాదిస్తుండగా ఆ దృశ్యాలను తన ఫేవరెట్ కెమెరాఉమెన్ సారా టెండూల్కర్ కెమెరాలో బంధించింది అంటూ పేర్కొన్నాడు. వాన చినుకులు ఎప్పుడూ తనకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయని..తనలో ఇంకా చిన్నపిల్లాడు ఉన్నాడని ఫన్నీ కామెంట్ చేశాడు సచిన్.
- Advertisement -